అనుకోకుండా వచ్చినా తండ్రికి తగ్గ తనయుడయ్యాడు  Rao Ramesh
2020-08-17 12:12:51

రావు గోపాలరావు అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు. సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ,  ఎప్పుడూ యదవ బిజినెస్సేనా. మడిసన్నాక కుసంత కళాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?”...లాంటి డైలాగ్స్ ఇప్పటికీ వాడుతూనే ఉంటారు కొందరు. అలాంటి ఆయన నటనా వారసత్వం అందుకుంటూ నటనా రంగంలోకి దూసుకొచ్చాడు ఆయన కొడుకు రావు రమేష్. బాలయ్య అప్పుడెప్పుడో నటించిన 'సీమసింహం' సినిమాతోనే ఆయన టాలీవుడ్‌కి పరిచయమైనా 'కొత్త బంగారులోకం', 'గమ్యం' సినిమాలు మాత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 

ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ఆయన్ను తెలుగు ప్రజల్లోకి తండ్రి ప్లేస్ లోకి తీసుకెళ్ళి కూర్చో పెట్టాయి. ఇప్పటికే దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించిన ఆయనకు అసలు నటనపై ఆసక్తి లేదట. ఈ విషయం ఆయనే ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిజానికి నటుడు కావడానికి ముందే రావు రమేశ్‌ డైరక్టర్ అవుదామనుకున్నాదట. ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మ దృష్టికి తీసుకెళ్లగా డైరెక్షన్ అంటే 24 క్రాప్ట్స్ తెలిసి ఉండాలని చెబుతూ దర్శకత్వం గురించి పెద్ద క్లాస్ పీకారట. అంతేకాక ఇప్పటికి నటించు తర్వాత కాలమే నీ కోరిక తీరుస్తుందని చెప్పారట. అలా అనుకోకుండా నటుడయిన ఈయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతెందుకు ఆయన కంటే ఎక్కువే పేరు తెచ్చుకున్నాడని చెప్పచ్చు.  

More Related Stories