రష్మిక మందన్నను ఏడిపించిన అభిమాని..  Rashmika Mandanna
2020-04-07 15:00:42

హీరోయిన్లు సినిమాల్లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంటారేమో కానీ బయట మాత్రం చాలా సెన్సిటివ్. వాళ్లు చాలా ఎమోషనల్. ఇలా కదిలిస్తే ఏడ్చేస్తుంటారు. రష్మిక మందన్న కూడా ఇదే టైప్. ఈమె సినిమాల్లో మీకు అర్థమవుతుందా అంటూ బాగా గట్టిగా అరుస్తుందేమో కానీ బయట మాత్రం ఇలా ముట్టుకుంటే ఏడ్చేస్తుంది. ఎప్రిల్ 6న ఈమె పుట్టిన రోజు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చాలా సందడి చేసారు. అంతా హ్యాపీ బర్త్ డే అని చెబుతుంటే తన 24వ పుట్టిన రోజును జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి కుటుంబంతో కలిసి హాయిగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. అలాగే అభిమానులతో కూడా చాలా సమయం సోషల్ మీడియాలో గడిపింది రష్మిక. 

ఈ సందర్భంగా ఓ అభిమాని చేసిన పనికి ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. ఏడ్చేసింది.. లైవ్ లోనే ఏడ్చేసింది. అది చూసి మిగిలిన వాళ్లు కూడా బాగానే ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఆమె అభిమాని అంతగా ఏం చేసాడబ్బా అనుకంటున్నారా..? పుట్టిన రోజు నాడు లాక్ డౌన్ కూడా పట్టించుకోకుండా దేవుడికి పాలాభిషేకం చేయించాడు. ఆ వీడియో చూసిన రష్మిక ఆనందంతో పొంగిపోయి కళ్లలోంచి గంగను బయటికి తీసుకొచ్చింది. ఇంత ప్రేమ పొందడానికి నేను మీకేం చేసానంటూ ఏడ్చేసింది ఈ బ్యూటీ. అలాగే మరో వ్యక్తి భిన్నంగా ఆలోచించి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. రష్మిక ఇప్పటి వరకు నటించిన సినిమాల్లోని సీన్లను కలిపి రష్మిక ఇన్‌స్పిరేషనల్ జర్నీ పేరుతో వీడియోను తయారు చేసి రష్మికకు ఇచ్చాడు. ఇది చూసి కూడా మరోసారి ఏడ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఉప్పొంగిన అభిమానం చూసి ఆమె కళ్లలోంచి నీటి ధారలు అలా బయటికి వచ్చేస్తున్నాయంతే. 

More Related Stories