ర‌ష్మికకి ఇంత చిన్న చెల్లెలాrashmika
2020-03-01 14:35:53

కన్నడ కస్తూరి రష్మిక మందన్న 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఛలో సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన ఆ భామ గీత గోవిందంతో సెటిలయిపోయింది. మొన్న మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా నితిన్‌ తో భీష్మతో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. అదే జోరుతో ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న శేషాచలం సినిమాలోనూ ఆమె ఛాన్స్ అందుకుంది. తాజాగా ర‌ష్మిక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. ఆ పిక్ లో రాజ వంశీకునిగా ఈ చిత్రంలో తలపై పాగా, నడుమున కత్తి పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్న ఆయన రష్మిక తండ్రి మదన్ మందాన. రష్మికకు మరో పక్క ఉన్నది ఆమె తల్లి సుమన్ మందాన. ఇక రష్మిక చంకనెక్కి దర్జాగా కూర్చుని ఉన్నది రష్మిక చెల్లి శిమన్. ఈ ఫోటోను రష్మిక, తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులో ర‌ష్మిక చెల్లిని గ‌మనిస్తే ఆమె వ‌య‌స్సు ఆరు లేదా ఏడేళ్లు ఉంటుంద‌నిపిస్తుంది. 23 ఏళ్ళ ర‌ష్మిక‌కి ఇంత చిట్టి చెల్లెలు ఉందా అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.   

 

More Related Stories