పంది కూర తింటూ వైన్ తాగుతా ..రష్మిక



Rashmika Mandanna
2020-11-25 12:48:20

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ద్వారా ఆరోగ్యకరమైన వంటల గురించి వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పటికే ఉపాసన షోకి వచ్చిన సమంత స్పెషల్ ఇడ్లి చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక తాజాగా యంగ్ బ్యూటీ రష్మీక మందన కూడా యువర్ లైఫ్ వెబ్ సైట్ కోసం ఓ ఆరోగ్యకరమైన వంట చేసింది. ఉపాసనతో కలిసి రష్మిక "కోలి పుట్టు" అనే స్పెషల్ చికెన్ ను వండింది. వంట చేస్తున్న సమయంలో రష్మిక ఉపసనతో కలిసి ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఉపాసన రష్మిక తో మాట్లాడుతూ..మీరు కోర్గీ సామాజిక వర్గానికి చెందిన వారు కాదా? అని అడగ్గా రష్మిక అవునని చెప్పింది. 

దాంతో ఉపాసన మీ సామాజిక వర్గంలో ఎక్కువగా పంది మాంసం తింటారు కదా అని మరో ప్రశ్న అడగ్గా...రష్మీక సమాధానం ఇస్తూ...అవును నేను పంది కూర తింటా..ఇంట్లోనే చేసుకుని వైన్ కూడా తాగుతాం.. అని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా మరిన్ని ఆసక్తికర విషయాలను రష్మిక ఉపసనతో కలిసి పంచుకుంది. . ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో "ఛలో" సినిమాతో రశ్మిక మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరవాత విజయ్ దేవరకొండ హీరోగా  వచ్చిన డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాలతో మరింత పాపులర్ అయింది. ఇక ఆ తరవాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన "పుష్ప" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

More Related Stories