ర‌ష్మిక మంద‌న్న రెమ్యున‌రేష‌న్ ఎందుకు పెంచిందో తెలుసా..  Rashmika Mandanna
2019-07-15 16:28:52

ఛలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చిన ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్న‌. ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డుకు సూప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. ఇక ఛ‌లో త‌ర్వాత గీత గోవిందం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ర‌ష్మిక ఇమేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈమె పారితోషికం కూడా అలాగే పెరిగిపోయింది. మ‌ధ్య‌లో వ‌చ్చిన దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రం జులై 26న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే త‌న రెమ్యున‌రేష‌న్ గురించి కూడా ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఏంటి మేడ‌మ్ పారితోషికం బాగా పెంచేసార‌ట క‌దా అంటూ మీడియా మిత్రులు అడిగితే ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నేళ్ల కెరీర్ లో ఎదుగుతున్న‌పుడు పారితోషికం పెంచడం కూడా సాధారణమైన విషయమే. ఎంత పెరిగితే త‌న ఎదుగుద‌ల కూడా అంతే ఉన్న‌ట్లు అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌ట్లో ఒక్కో సినిమాకు 40 ల‌క్ష‌లు తీసుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా కోటి దాటేసింది. అయితే క‌న్న‌డ‌లో మాత్రం ఇప్ప‌టికీ త‌క్కువే తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ 'పొగరు'కు 64 లక్షలు తీసుకున్న‌ట్లు చెప్పింది ర‌ష్మిక మంద‌న్న‌. అయినా తీసుకున్న రెమ్యున‌రేష‌న్ గురించి అలా ఓపెన్ గా చెప్ప‌డం కూడా గొప్ప విష‌య‌మే కదా..? 

More Related Stories