టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవీనా టాండన్.. Raveena Tandon
2020-05-17 00:45:12

బాలీవుడ్‌ హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీతో కూడా మంచి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే వాళ్లు కూడా కొన్ని తెలుగు సినిమాలు చేసారు కాబట్టి. ఇప్పుడు రవీనా టాండన్ కూడా టాలీవుడ్ హీరోలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసింది. బాలయ్య హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. దానికంటే ముందు రథసారథి.. ఆ తర్వాత  ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలు చేసింది రవీనా. ప్రస్తుతం కెజియఫ్ 2లో నటిస్తుంది. ఇందులో రాకీ భాయ్ ను పట్టుకునే ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది రవీనా. చివరికి ఆమె చేతుల్లోనే రాకీ జీవితం అంతమైపోతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇక ఈ సినిమా సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై ఇక్కడి హీరోలపై కొన్ని కామెంట్స్ చేసింది రవీనా. తనకు తెలుగు హీరోలందరితోనూ మంచి అనుబంధముందని గుర్తు చేసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే తనకు హైదరాబాద్ రెండో ఇల్లు అంటుంది రవీనా. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ లాంటి హీరోలతో పని చేసానని.. అందరూ చాలా మంచి వ్యక్తులు అని చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. తనకు మళ్లీ నాకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని.. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని.. ఆయన తన గురించి మాట్లాడిన మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయని తెలిపింది ఈమె. ప్రభాస్‌తో డ్యాన్స్ చేయడం మంచి అనుభవమని.. ప్రస్తుతం దక్షిణాదికి చెందిన యంగ్ హీరోలందరూ చాలా కష్టపడుతున్నట్లు చెప్పింది రవీనా. 

More Related Stories