రవితేజ "క్రాక్"చివరి షెడ్యూల్ ప్రారంభంKrack Movie.jpg
2020-10-07 15:44:29

మాస్ మహరాజ్ రవితేజ-గోపి చంద్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం "క్రాక్". ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలుపెట్టగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే తాజాగా లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రాక్ షూటింగ్ బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ సెట్స్ లో రవితేజ తుపాకీ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

షూటింగ్ తిరిగి ప్రారంభించడంతో చిత్ర బృందం  ఈ సినిమా గురించి అప్డేట్ లు ఇవ్వడం తిరిగి మొదలుపెట్టింది. సినిమా రిలీజ్, సాంగ్స్ పై కూడా త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నట్టు   తెలుస్తోంది. ఇదిలా ఉండగా రవితేజ-గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంతో తమ అభిమాన హీరో రవితేజ పక్కా మరో హిట్ కొడతాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, డాన్ శ్రీను సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇక హ్యాట్రిక్ కొడతారా..లేదా అన్నది చూడాలి.

More Related Stories