రవితేజ ఖిలాడి రిలీజ్ డేట్ 



Ravi Teja Khiladi
2021-01-31 07:33:23

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా "ఖిలాడి". ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో రవితేజ పక్కన ఇద్దరు భామలు నటిస్తున్నారు. వారిలో ఒకరు డింపుల్ హయాతి..మరొకరు మీనాక్షి చౌదరి. ఇక ఈ సినిమాను కూడా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో రవితేజ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఈ విషయాన్ని అర్జున్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఖిలాడి చిత్రాన్ని మే 28 న విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఇదే నెలలో మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ నారప్పలు కూడా విడుదల కాబోతున్నాయి. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుందని అనుకుంటే ఇప్పుడు ఆ పోటీలో రవితేజ కూడా జాయిన్ అయ్యాడు. అంతే కాకుండా సమ్మర్ లో మరో రెండు సినిమాలు కూడా విడుదల కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఏడాది సమ్మర్ మొత్తం బాక్స్ ఆఫీస్ వద్ద పండగ వాతావరణం ఉండబోతుందని అర్థం అవుతోంది.

More Related Stories