అఫీషియ‌ల్‌..సంక్రాంతి రేసులో రవితేజ క్రాక్ 



 Ravi teja krack
2020-12-19 15:40:03

రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం క్రాక్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు.  సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయబోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించారు. రాజా ది గ్రేట్ చిత్రం త‌ర్వాత  స‌రైన హిట్ సాధించని ర‌వితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్‌గా   ఈ చిత్రంలోని ‘భలేగా తగిలావ్‌ బంగారం’ అనే లిరికల్‌ వీడియోను చిత్రబృందం  విడుదలచేసింది. అనిరుధ్ ఆల‌పించిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించగా తమన్‌ బాణీలను సమకూర్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. 

More Related Stories