ఆహాను అల్లాడిస్తున్న క్రాక్..తక్కువ టైమ్ లో రికార్డు వ్యూవ్స్



Ravi Teja
2021-02-27 11:23:52

సంక్రాంతి కి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా క్రాక్.  నాలుగేళ్ళ తరవాత క్రాక్ తో మళ్ళీ హిట్ ట్రాక్ పై పడ్డాడు మాస్ రాజా. ఇక ఈ సినిమా 50 శాతం సీటింగ్ లోనూ వసూళ్ల బీభత్సం సృష్టించింది. విడుదలైన మూడు వారాలకే సినిమాను అల్లు వారి ఓటీటీ "ఆహా" లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న క్రాక్ ఇక్కడ థియేటర్ల చూపించిన దూకుదునే ప్రదరిస్తోంది. ఇప్పటి వరకు ఆహాలో కలర్ ఫొటోకు ఎక్కువ వ్యువ్స్ ఉన్నాయి. అయితే అతి తక్కువ సమయంలోనే క్రాక్ ఆ రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లో 5మిలియన్ మినిట్స్ వ్యువ్స్ వచ్చిన క్రాక్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మొత్తం 250 మిలియన్ వ్యూవ్స్ వచ్చినట్టు ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రాక్ సినిమాను ఆహా రూ.8.4 కోట్లకు కొనేసింది. నిజానికి ఈ సినిమాను జనవరి 29 నుండి స్ట్రీమ్ చేయాలని భావించినా బయ్యర్లు గోల చేయడంతో మరో వారం పొడిగించి ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

More Related Stories