షూటింగ్ పూర్తిచేసుకున్న క్రాక్..రిలీజ్ అప్పుడే Ravi Teja
2020-11-12 00:28:19

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతే కాకుండా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు "క్రాక్" టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. అందాల తార శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు. ఈ సినిమాలో అర్జీవీ హీరోయిన్ అప్సరా రాణి ఓ ఐటమ్ సాంగ్ లో వయ్యారాలు వలకబోసింది. ఇక ఇదే కాంబినేషన్ లో వచ్చిన బలుపు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో క్రాక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రవితేజ ఆ అంచనాలను అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం కిలాడి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన "కిలాడి" ఫస్ట్ లుక్ కు మంచి టాక్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో జబర్ధస్త్ బ్యూటీ అనసూయ బరధ్వాజ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు.

More Related Stories