మళ్ళీ రవితేజను థియేటర్లో చూసేది అప్పుడేrt
2020-01-26 20:15:18

ఇటీవల డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో మాస్ మహరాజ్‌ రవితేజ ఈ రోజు పుట్టిన రోజుజరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకి తీపి కబురు అందించారు. అదేంటంటే ఇదివరకు తనకు రెండు బ్లాక్ బస్టర్లు అందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో రవితేజ మూడోసారి కలిసి చేస్తోన్న సినిమా 'క్రాక్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జ‌న‌వ‌రి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'క్రాక్' మూవీ విడుదల తేదీ ఫిక్స్ చేశారు. క్రాక్ సినిమాని మే 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో ఉండి పోలీస్ వెహికిల్ నుంచి బయటకు వచ్చేలా లుక్ ఉంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామంటున్న ఈ 'క్రాక్'లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తోన్న మొదటి సినిమా ఇది. ఇక సంక్రాంతికి ఈ సినిమాలో ఫ్యామిలీ ఫోటోను రిలీజ్ చేసారు. శృతి హాసన్ బైక్ నడుపుతుండగా, వెనకాల రవితేజ పిండి వంటలతో కలిగిన క్యాన్ లను పట్టుకుని కూర్చున్నాడు. ముందు వాళ్ళిద్దరి కొడుకులా అనిపించే ఒక బుడ్డోడి ఫొటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న క్రాక్ షూటింగ్ ఏప్రిల్ లో కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రెండు కీలక పాత్రల్ని తమిళ నటులు సముద్ర ఖ‌ని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ మీద మధు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

More Related Stories