రొమాంటిక్ రాజా రవితేజ.. ఖిలాడిలో అదిరిపోయే లిప్ లాక్ సీన్..



Ravi Teja
2021-01-20 16:39:49

రాజా ది గ్రేట్ తర్వాత సరైన విజయం లేక రవితేజ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా ఈయన నటించిన క్రాక్ సినిమా విజయం సాధించింది. దాంతో మాస్ మహారాజా రవితేజ కెరీర్ కు కొత్త ఊపు వచ్చింది. ఈ ఒక్క సినిమాతో మళ్లీ రవితేజ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అంతకుముందు కొన్ని సినిమాలు కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేక రవితేజ మార్కెట్ ను ప్రశ్నించాయి. కానీ 'క్రాక్' ఇచ్చిన ఎనర్జీతో 'ఖిలాడి' సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో రవితేజతో వీర సినిమా చేసిన రమేష్ వర్మ దీనికి దర్శకుడు. రెండేళ్ల కింద బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా తెరకెక్కించాడు. ఈయన ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖిలాడీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, గద్దలకొండ గణేష్ లో ఐటం సాంగ్ చేసిన డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ అదిరిపోయే లిప్‌లాక్‌ సీన్‌లో నటించాడని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఈయన లిప్ లాక్ సీన్ చేసాడని తెలుస్తోంది. ఈ సీన్‌ను ఇప్పటికే వైజాగ్‌లో చిత్రీకరించారని చిత్ర వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నిజానికి ఈ సీన్ చేయడానికి ముందు రవితేజ చాలా అభ్యంతరం వ్యక్తం చేసాడని తెలుస్తోంది. అలాంటి సన్నివేశంలో నటించడానికి మొహమాట పడితే దర్శకుడు రమేష్ వర్మ ఆ సీన్ కు ఉన్న ఇంపార్టెన్స్ చెప్పి చాలా కష్టపడి రవితేజను ఒప్పించాడని తెలుస్తుంది. సుశాంత్ హీరోగా వస్తున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మీనాక్షి.. అది విడుదల ఒక ముందే రవితేజతో అవకాశం అందుకుంది.

మోడలింగ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు లిప్ లాక్ సీన్ చేయడం పెద్ద కష్టం కాదు. అంతకు ముందు ఆమె హిందీ మ్యూజిక్ వీడియోల్లోనూ, 'ఔట్ ఆఫ్ లవ్' అనే వెబ్ సిరీస్‌లోను నటించింది. ఇప్పుడు టాలీవుడ్ కు పరిచయం అవుతుంది 'ఖిలాడి' చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దేవి శ్రీ తమ్ముడు సాగర్ మాటలు రాస్తున్నారు. డాక్టర్ జయంతిలాల్ గడ ఫిలిం స్టూడియోస్‌ సమర్పణలో ఎ స్టూడియోస్ LLP బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

More Related Stories