రవితేజ ఖిలాడి వేషాలు షురూ.. ముహూర్తం పెట్టాడు.. Ravi Teja
2020-10-19 16:50:47

ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ మాత్రం జోరు తగ్గించడం లేదు. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇచ్చిన లాక్ డౌన్ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ లేదంటే మాత్రం వరసగా షూటింగ్స్ తోనే బిజీగా ఉండేవాడు మాస్ రాజా. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇప్పటికే గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ సినిమా దాదాపు పూర్తైపోయింది. ఈ సినిమా మే 8నే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. దాంతో పాటే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యాడు ఈయన. దీనికి ఖిలాడీ అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు దర్శకనిర్మాతలు. గతేడాది రాక్షసుడు సినిమాలు నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఖిలాడి సినిమా వస్తుంది.

వీర సినిమా తర్వాత మరోసారి ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడు రవితేజ. ఈ సినిమా కూడా పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా ఇది ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి 110 రోజుల షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. 2021 సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా రవితేజ ఓ సినిమాకు కమిటయ్యాడు. కిక్, కిక్ 2, టచ్ చేసి చూడు లాంటి సినిమాలకు కథలు అందించిన ఈయన ఇప్పుడు రవితేజను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏదేమైనా కూడా వరస సినిమాలతో కుమ్మేస్తున్నాడు మాస్ రాజా. మరి ఖిలాడీగా ఈయనేం మాయ చేస్తాడో చూడాలి. 

More Related Stories