ర‌వితేజ ఫ్యామిలీ ఫోటో అదిరిపోయిందిగా..  Ravi Teja
2020-04-13 23:29:35

లాక్ డౌన్ స‌మ‌యంలో ఇళ్లు వ‌దిలి బ‌య‌టికి అడుగు పెట్టేది లేదు. దాంతో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే ప్రాణాలు క‌దా.. అందుకే దొరికిన టైమ్ ను పూర్తిగా పిల్ల‌ల‌కు ఇచ్చేస్తున్నారు. ప్ర‌తీ స్టార్ హీరో కూడా ఇప్పుడు ఇదే ప‌ని చేస్తున్నాడు. ర‌వితేజ కూడా ఇదే చేసాడు ఇప్పుడు. ఈయ‌న కుటుంబం ఎలా ఉంటుందో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఎప్పుడూ బ‌య‌టికి తీసుకురాడు ర‌వితేజ‌. దాంతో ఈయ‌న కుటుంబం ఎప్ప‌టికీ స‌స్పెన్సే. కొడుకు మ‌హాధ‌న్ మాత్రం రాజా ది గ్రేట్ సినిమాలో న‌టించాడు కాబ‌ట్టి ప‌రిచ‌య‌మే. అయితే ఈయ‌న కూతురు చాలా పెద్ద‌ది. ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న‌నాటి ఫోటోలు చూడ‌ట‌మే కానీ ఇప్పుడెలా ఉంద‌నేది తెలియ‌దు. 

ఇప్పుడు ర‌వితేజ త‌న కొడుకు, కూతురుతో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. ఇంటి ప‌ట్టునే ఉండండి.. బ‌య‌టికెళ్లొద్దు అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసాడు ఈయ‌న‌. త‌న పిల్ల‌ల‌తో పాటు త‌మ్ముడు ర‌ఘు పిల్ల‌లు కూడా ఈ పోటోలో ఉన్నారు. మొత్తానికి లాక్ డౌన్ పీరియ‌డ్ అంతా పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకుంటున్నాడు మాస్ రాజా. ప్ర‌స్తుతం ఈయ‌న గోపీచంద్ మ‌లినేనితో క్రాక్.. ర‌మేష్ వ‌ర్మ‌తో ఓ సినిమా.. త్రినాథ‌రావు న‌క్కిన‌తో మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు. అలాగే వ‌క్కంతం వంశీతోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు మాస్ రాజా. 

More Related Stories