రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా కొత్త చిత్రం ప్రకటనravi teja sudheer varma abhishek namas rt70 announced
2021-11-02 04:27:53

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇచ్చారు మేకర్స్. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ 70వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో హీరోలు నిలిచి ఉండరు అని కొటేషన్ రాసి ఉంది. ఇక వెనకాల చెక్కినట్టుగా రకరకాల శిల్పాలు కనిపిస్తున్నాయి. అలా మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కథ, కాన్సెప్ట్ ఉన్నట్టు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. నవంబర్ 5న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.

More Related Stories