దగ్గుబాటి వారసుడితో రవితేజ మల్టీస్టారర్..?rana
2020-04-16 15:06:13

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. దాంతో పాటే ఎందుకో తెలియదు కానీ మలయాళ సినిమాలపై కూడా మన హీరోలు మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. దాంతో పాటు రామ్ చరణ్ ఈ మధ్యే విడుదలై సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రైట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో మలయాళ సినిమా కూడా తెలుగులో రీమేక్ కాబోతుంది. పృథ్వీరాజ్‌, బిజు మీనన్‌ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పన్ కుషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ భారీగానే పెట్టి కొన్నారు హారిక హాసిని క్రియేషన్స్. అక్కడ ఇందులో పృథ్వీరాజ్‌, బిజుమీనన్ నటించారు.

ఇప్పుడు తెలుగులో పృథ్వీ పాత్రలో రానా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బిజు మీనన్‌ పాత్ర కోసం బాలకృష్ణను అనుకుంటున్నట్లు వార్తలొచ్చినా కూడా ఇఫ్పుడు రవితేజ ఫిక్సైపోయాడని తెలుస్తుంది. కానీ ఈ హీరో ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ సినిమాను లైన్ లో పెట్టాడు ఈయన. ఇదిలా ఉంటే ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. రణరంగం సినిమా తర్వాత ఈయనకు సినిమాలు లేవు.. తెలుగులో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మించబోతున్నాయి. మొత్తానికి రానా, రవితేజ కలిసి నటిస్తే చూడ్డానికి కూడా భలే బాగుంటుంది.

More Related Stories