అజయ్ భూపతి సినిమా నుంచి రవితేజ ఔట్.. వచ్చిన కన్ఫర్మేషన్..  Ravi teja
2019-09-08 16:52:01

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి ఇప్పటి వరకు రెండో సినిమా అయితే మొదలు పెట్టలేదు. అయితే మహాసముద్రం పేరుతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. రవితేజకు చెప్పడం.. ఆయన కూడా ఓకే అనడం అన్నీ జరిగిపోయాయి. ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు కూడా. అయితే కొన్ని రోజుల కింద చీప్ స్టార్ అంటూ ఒక సంచల ట్వీట్ చేసాడు అజయ్. అది ఎవర్ని అన్నాడనేది మాత్రం సస్పెన్స్. కానీ రవితేజతో ఈయనకు వార్ జరిగిందని.. కథ విషయంలో జరిగిన వివాదం కారణంగానే ఈ సినిమాను రవితేజ బయటికి వచ్చేసాడని తెలుస్తుంది. అందుకే ఆయన్ని ఉద్ధేశించి చీప్ స్టార్ అనే ట్వీట్ చేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే మహాసముద్రం సినిమా నుంచి రవితేజ బయటికి రావడం నిజమే.. ఇంతకు మించి ఈ సినిమా గురించి తననేం అడగొద్దు అంటున్నాడు అజయ్. ప్రస్తుతం తాను వేరే హీరోను వెతికే పనిలో ఉన్నానని.. ఇందులో సిద్ధార్థ్ మరో హీరోగా నటించే అవకాశాలున్నాయని చెబుతున్నాడు అజయ్. నాగచైతన్య ఈ కథపై ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక.. చివరికి మహాసముద్రంలోకి ఏ హీరో వచ్చి చేరతాడో..?

More Related Stories