మూడు సినిమాలు లైన్ లో పెట్టిన రవితేజ...టెన్షన్ లో ఫ్యాన్స్Ravi Teja.jpg
2019-11-07 11:43:34

టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న హీరో మాస్ మహారాజ్ రవితేజ కాస్త గ్యాప్ ఇచ్చి చేస్తున్న సినిమా ‘డిస్కో రాజా’. ఆ సినిమా విడుదల కాకుండానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతున్న ఆ సినిమాను అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. అలా రిలీజ్ కి ముందే ఒక సినిమా లైన్ లో పెట్టిన రవి తేజ మరో రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టినట్టు సమాచారం.

అయితే ఇప్పుడు ఆ విషయం మీదనే మాస్ మహారాజా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే నిజానికి గోపీచంద్ మలినేని సక్సెస్ లో లేరు. అలా ఒక ఫ్లాప్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడని బాధ పడుతుంటే మరో రెండు సిఇమలు కూడా అలాంటి అటూ ఇటూ ఉన్న డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కలిసి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా స్క్రిప్టు రెడీ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన సానుకూలంగా స్పందించలేదట. దీంతో మార్పులేమీ చేయకుండానే అదే స్క్రిప్టు పట్టుకెళ్లి రవితేజకు చెప్పగా మాస్ రాజా ఓకే చెప్పేశాడట. నిర్మాతను సెట్ చేసుకుని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇది కాక గతంలో రవితేజకి ‘వీర’ అనే సినిమాతో ప్లాప్ ఇచ్చిన రమేష్ వర్మతో సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పారని సమాచారం.

నిజానికి రమేష్ వర్మ చాల రోజుల తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ తో చేసిన ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ అందుకున్నారు. దాంతో లైం లైట్ లోకి వచ్చిన రమేష్ వర్మ రవితేజకి ఓ లైన్ చెప్పి ఒప్పించారని రాక్షసుడు సినిమాని నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని అంటున్నారు. దీంతో అందరూ ఫాంలో లేని డైరెక్టర్స్ కి రవి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన అభిమనులు టెన్షన్ పడుతున్నారు. 

More Related Stories