డిస్కోరాజా.. సెన్సార్ టాక్disco
2020-01-20 20:25:33

రవితేజకు సరైన హిట్ లేక చాలా కాలమైంది. దాంతో తన ఆశలన్నీ ఈ నెల 24న రిలీజ్ కి రెడీ అవుతున్న 'డిస్కో రాజా' పైనే ఉన్నాయి. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్య హోప్.. తొలిసారి ఈ ముగ్గురు హీరోయిన్లతో అలరించనున్నాడు మాస్ మహారాజా. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ఈ సినిమా పై ఆసక్తిని పెంచాయి. అయితే.. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు 'డిస్కోరాజా'కు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్ చెప్పకుండా.. కొన్ని డైలాగ్స్ కు మ్యూట్ పెట్టి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఇక సెన్సార్ టాక్ ప్రకారం రవితేజ తనదైన మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో అలరించడం ఖాయమంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. ఒకప్పటి రవితేజను ఇందులో చూడొచ్చని అంటున్నారు. దాంతో మాస్ మహారాజాకి ఈ సారి మంచి హిట్ పడినట్టే అంటున్నారు. అలాగే ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చాయి. ఆ వారం మరే ఇతర సినిమా కూడా విడుదల కావడం లేదు. దాంతో డిస్కోరాజాకు పోటీలేదనే చెప్పాలి. రవితేజ సోలోగానే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ భారీగానే వచ్చే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. మరి ఆడియెన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి

More Related Stories