ర‌వితేజ‌, రమేష్ వర్మ `ఖిలాడి` టాకీ పార్ట్ పూర్తి.



Raviteja Khiladi update
2021-09-24 22:46:15

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రెండు పాటలను త్వరలోనే చిత్రీకరించి రిలజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

More Related Stories