కథలు ఇంక చాలు.. పవన్ రాకపోవడానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంది..Pawan kalyan
2020-08-15 13:54:48

నిహారిక ఎంగేజ్ మెంట్ కు పవన్ కళ్యాణ్ రాకపోయేసరికి మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పక్కాగా మెగా సోదరుల మధ్య మళ్లీ అంతర్యుద్ధం మొదలైపోయిందని.. అందుకే కూతురు నిహారిక నిశ్చితార్థానికి కూడా పవన్ రాలేదని అంటూ వార్తలు వచ్చేసాయి. పైగా నితిన్ వేడుకకు వచ్చిన పవన్.. సొంత అన్న కూతురు వేడుకకు రాకపోవడం ఏంటి అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. దీని వెనక మాత్రం చాలా పెద్ద కథ ఉంది. పక్కా కారణం ఉన్నందుకే పవన్ రాలేదు. ప్రస్తుతం ఈయన చాతుర్మాస దీక్షలో ఉన్నాడు. గత 17 ఏళ్లుగా ఇది చేస్తూనే ఉన్నాడు ఈయన. 

అప్పుడు తన పర్సనల్ కోసం చేసిన ఈయన ఇప్పుడు కరోనా పోవాలని ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చాతుర్మాస దీక్షలో భాగంగా సాయంత్రం 6 తర్వాత ప్రత్యేక పూజలు చేయాల్సి వస్తుంది. ప్రతీరోజూ ఇది చేయాలి. అందుకే 6 తర్వాత ఈయన ఎక్కడికి వెళ్లడం లేదు. నిహారిక నిశ్చితార్థం సాయంత్రం పెట్టుకున్నారు. దాంతో పొద్దున్నే వెళ్లి అన్నయ్య కూతురుకు ఆశీర్వాదాలు ఇచ్చి.. సాయంత్రం తాను రాలేనని ముందుగానే నాగబాబుకు చెప్పి వచ్చినట్లు పవన్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అప్పుడు నితిన్ వేడుకకు కూడా ఉదయం వచ్చి వెళ్లాడు పవన్. మొత్తానికి ఆ కారణం ఉంది కాబట్టే అలా చేసాడు పవన్. 

More Related Stories