మహేష్ బాబును చిరంజీవి వద్దనడానికి కారణమదేనా...Chiranjeevi Mahesh Ramcharan.jpg
2020-03-14 09:38:30

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. కొన్ని రోజులుగా రామోజీ ఫిలింసిటీలోనే ఆచార్య కోసం ప్రత్యేకంగా భారీ సెట్ ఒకటి నిర్మించారు. ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు కొరటాల శివ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. ఇందులో చిరంజీవితో పాటు మహేష్ బాబు కూడా నటిస్తాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. దానికితోడు చిరు ఇందులో కాసేపు నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. దాంతోపాటే దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాల గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ.

ఇదిలా ఉంటే ఆచార్య సినిమా నుంచి మహేష్ తప్పుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించడానికి మహేష్ ఒప్పుకున్నా కూడా 30 రోజులు డేట్స్ ఇచ్చి 30 కోట్ల రెమ్యూనరేషన్ కూడా అడిగాడు. దాంతో ఇంత భారీగా పారితోషికం ఇవ్వడం చిరంజీవికి నచ్చడం లేదని తెలుస్తోంది. పైగా మహేష్ బాబు చేసినా కూడా ఈ చిత్రానికి ప్రత్యేకంగా యాడ్ అయ్యే మార్కెట్ ఏదైనా ఉందా అని లెక్కలు వేసుకున్న తర్వాత చిరు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఇదే పాత్ర చరణ్ చేసినా కూడా ఇదే రేంజ్ వస్తుందని చిరు నమ్ముతున్నాడు. అందుకే ఈ పాత్రను రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని మెగాస్టార్ భావిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్న సమాచారం.

అయితే మెగాస్టార్, సూపర్ స్టార్ కలిస్తే వచ్చే మల్టీస్టారర్ కు క్రేజ్ ఆకాశమంత ఉంటుంది. జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. దానికి తోడు కొరటాల శివ తనకు మహేష్ బాబు కావాలి అని పట్టుబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ చిరు మాత్రం మహేష్ బాబును దూరం పెట్టేసాడని.. చరణ్ ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి వస్తుందేమో అనుకున్న భారీ మల్టీస్టారర్ అంచుల దాకా వచ్చి ఆగిపోయిందన్నమాట.

More Related Stories