పవన్ మూడు పెళ్ళిళ్ళ వెనక ఇంత కథ ఉందాPawan Kalyan
2020-04-25 10:56:49

ఒకరకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఎప్పుడూ వార్తల్లోకి వస్త్తూనే ఉంటుంది. పవన్ తన వ్యక్తిగత విషయాల కంటే రాజకీయంగానే మాట్లాడానికి ప్రయత్నించేవాడు కానీ ఒకే ఒక్కసారి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయతో సరిపడలేదు. అందుకే చాలా మర్యాదగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. రెండు కుటుంబాల ఉమ్మడి అంగీకారంతో కోర్టు నిబంధనలకు లోబడి చట్టపరంగా ఏమేం చేయాలో అన్నీ చేసి విడాకులు తీసుకున్నాడు. తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ తో ఒక అండర్ స్టాండింగ్ ఏర్పడింది. కొంత కాలం  సహజీవనం చేశారని తర్వాత పెళ్లి చేసుకున్నారని, వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయో ఏమో ? ఇద్దరూ ఉమ్మడి అంగీకారంతోనే విడిపోయారు.

విడాకులు ఎవరు ముందు అడిగారో తెలియదు. ఆ తరువాత 2013లో జయంత్ పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఒక పాటలో కనిపించిన అన్న లెజెనోవా అనే రష్యన్ ని ప్రేమించి వివాహమాడారు పవన్.  అయితే గతంలో తన పెళ్ళిళ్ళ విషయంలో తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, తెలిస్తే ఎవరూ ఈ విధంగా తనని అనరని ఆయన చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాల వల్లనే తన జీవితంలో ఈ విధంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చిందని, అన్ని విషయాలు విడమర్చి చెప్పడం ఎంతటి వ్యక్తికైనా కుదరని పని అని పవన్ అప్పట్లో బహిరంగంగానే చెప్పారు.  

More Related Stories