పవన్ అభిమానిపై మండిపడిన రేణు దేశాయ్..renu
2020-04-21 07:20:47

అవును.. ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు మంట తెప్పించాడు ఓ ఫ్యాన్. ఈమెను ఓ పిచ్చి ప్రశ్న అడిగి విసుగు పుట్టించాడు. హీరోయిన్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా మెగా కోడ‌లిగానే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. బ‌ద్రి.. జానీ లాంటి సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైంది. 2008లో పెళ్లి కూడా చేసుకుంది. ఏమైందో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా ఇద్ద‌రూ విడిపోయారు. ప‌వ‌న్, రేణు విడిపోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. రేణుదేశాయ్ తో విడిపోయిన త‌ర్వాత అన్నా లెజినీవాను మ‌రో పెళ్లి చేసుకున్నాడు ప‌వ‌న్. కానీ రేణు మాత్రం పిల్ల‌ల‌తో ఒంట‌రిగా పూణేలో ఉంటుంది. ఇక ఇప్పుడు బద్రి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది ఈమె. ఈ సినిమా తనకు రెండు బహుమతులను ఇచ్చిందని.. అదే ఆద్య, అకీరా అంటూ పవన్ ను ప్రస్థావించలేదు రేణు. దాంతో ఓ అభిమాని ఈ రేణుదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు...

ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్ట్లు ఎందుకు? ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా... ఆ విషయం ఏమైంది? అంటూ పోస్ట్ చేసాడు. ఇది చూసిన రేణు వెంటనే స్పందించింది. ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు నాకు వచ్చింది అంటూ రేణు ఆన్సర్ ఇచ్చింది. అవసరమా... అంటే అవును అవసరం. బద్రీ వచ్చి నేటికి 20 ఏళ్లు. ఈ సినిమాను చాలామంది మరిచిపోయారు. కాని ఇది నా మొదటి సినిమా. నాకు చాలా చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకు అన్నా.. మనం ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అందరి కోసం కాస్త మంచిగా ఆలోచించండి అంటూ క్లియర్‌గా అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రాసుకొచ్చింది రేణు దేశాయ్. తన జ్ఞాపకాలను పంచుకోవడం కూడా తప్పుగా అనిపిస్తుంది కొందరికి అంటూ ఫైర్ అయిపోయింది రేణు దేశాయ్.

 

More Related Stories