వెబ్ సిరీస్ లో బిజీ..అందుకే పెళ్లికి హాజరవ్వలేదు



 Renu Desai
2020-12-16 14:49:52

మెగాడాటర్ నిహారిక-చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మెగా ఫ్యామిలోని ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం పెళ్లికి హాజరుకాలేదు. దాంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. రేణు దేశాయ్ కి ఆహ్వానం అందలేదని అందుకే పెళ్లికి హాజరవ్వలేదని చెవులు కోరుకున్నారు. కాగా రేణు దేశాయ్ ఆ గుసగుసలకు చెక్ పెట్టింది. నిహారిక వివాహానికి రాకపోవడానికి గల కారణాలను ఓ కార్యక్రమంలో వెల్లడించింది.

నిహారిక పెళ్లికి ఆహ్వానం అందిందని కానీ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్న కారణంగా..బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయానని చెప్పుకొచ్చింది. ఇక పవన్ తో పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్ మళ్ళీ కమ్ బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆద్య అనే ఓ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ బిజీ కారణంగానే రాలేకపోయానని చెబుతున్నారు. అయితే నిజానికి రేణు దేశాయ్ కి పెళ్లికి రావాలని ఉంటే షూటింగ్ ను క్యాన్సిల్ చూసుకునేవారని..ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న మెగాస్టార్, రాంచరణ్ లు పెళ్లికి హాజరవ్వలేదా..అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More Related Stories