బ‌ద్రికి 21 ఏళ్లు...రేణూదేశాయ్ ఆస‌క్తిక‌ర పోస్ట్



 Renu Desai
2021-04-20 17:12:24

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కేరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రాల్లో బ‌ద్రి సినిమా ఒక‌టి. పూరీ జగన్నాథ్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ఆ త‌ర‌వాత వెన‌క్కిచూసుకోలేదు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్ లు గా అనీషా ప‌టేల్ తో పాటు రేణు దేశాయ్ న‌టించారు. 

ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్ర‌మే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు డిజైన‌ర్ గా కూడా రేణు దేశాయ్ వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప‌వ‌న్ రేణూ దేశాయ్ మ‌ధ్య పరిచయం ఏర్పడింది. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ జాని సినిమాలో న‌టించారు. ఈ క్ర‌మంలో ప్రేమ‌లో ప‌డిన వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. వీరికి కొడుకు అఖిరా నంద‌న్, కూతురు ఆద్య ఇద్ద‌రు సంతానం కూడా ఉన్నారు. 

అయితే ఏవో కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చిది. దాంతో ప్ర‌స్తుతం విడాకులు తీసుకుని ఎవ‌రి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా నేటికి బ‌ద్రి సినిమా వచ్చి 21 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్ ఆనాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి దిగిన ఓ ఫోటోనూ షేర్ చేశారు. ఏ చికితా పాట షూటింగ్ స‌మ‌యంలో ఆ ఫోటో దిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలో ప‌వ‌న్ గ‌న్ ప‌ట్టుకుని కనిపిస్తుండ‌గా రేణూదేశాయ్ ముఖాన్ని దుప‌ట్టాతో క‌వ‌ర్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

More Related Stories