మెగా ఫ్యామిలీలో వర్మ నెక్స్ట్ టార్గెట్ ఆయనే  RGV
2020-07-30 17:43:15

వర్మ బుర్ర పెట్టి సినిమాలు తీయడం ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు కేవలం ఆయన పబ్లిసిటీ చేసి సినిమాలు తీస్తున్నారు. అలా చేసి తీసిన మరో సినిమానే పవర్ స్టార్. ఈ సినిమా రిలీజ్ కాక ముందు వరకూ ఎన్నో వివాదాలకి కేరాఫ్ గా మారగా ఆ మూవీ విడుదల తరువాత వర్మపై పవన్ ఫ్యాన్స్ కి కోపం తగ్గింది. అయితే వర్మ మళ్ళీ మెగా ఫ్యామిలీని గిల్లడానికి వర్మ రెడీ అవుతున్నదని తెలుస్తోంది. అయితే ఈసారి టార్గెట్ నిర్మాత అని అంటున్నారు. 

వర్మ ఈసారి మెగా ఫ్యామిలీకి చెందిన నిర్మాత అల్లు అరవింద్ పై మూవీకి సిద్ధం అవుతున్నాడని, సమాచారం. అలాగే ఆ మూవీకి టైటిల్ కూడా బావ రాజ్యం అని పెడుతున్నట్ట ప్రచారం జరుగుతోంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీలో కీలక పాత్రను అల్లు అరవింద్ పోషించారు . నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక విషయాలు ఆయనే చేశారు. ఆరోజుల్లో ఆయన సీట్లు అమ్ముకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే వర్మ బావరాజ్యం మూవీ తెరకెక్కనుందని కంపెనీ వర్గాల సమాచారం. చూడాలి మరి ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ?

More Related Stories