పవర్ స్టార్ లో పవన్ కళ్యాణ్ ను వర్మ తిట్టాడా.. పొగిడాడా..RGV Power Star
2020-07-28 03:07:04

ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. పవర్ స్టార్ వర్మ అనుకున్న దాని కంటే మంచి ఆదాయం తీసుకొచ్చింది. ముందు నుంచి కూడా దీన్ని సినిమా అంటూ ప్రమోట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇది కేవలం ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. కేవలం 37 నిమిషాలు మాత్రమే సినిమా తీసి దాన్ని కూడా చాలా తెలివితేటలతో అమ్ముకున్నాడు వర్మ. అయితే ముందు విడుదలైన పోస్టర్లు ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నాడు.. మళ్లీ ఆయన్ని జోకర్ చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ విడుదలైన తర్వాత సీన్ మరోలా ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ ను ఆయన కమెడియన్ గా ఏ మాత్రం చూపించలేదు. ఇంకా మాట్లాడితే పవన్ పాత్ర చాలా హుందాగా  చూపించాడు.

అక్కడున్న వాస్తవ పరిస్థితులను చెప్పడానికి వర్మ మ్యాగ్జిమం ట్రై చేశాడు. కాకపోతే మధ్యలో మళ్ళీ కొన్ని తన మార్కు చిలిపి పనులు చేశాడు వర్మ. పవన్ కళ్యాణ్ భార్యల విషయంలో.. అలాగే పూణే నుంచి ఫోన్ రావడం.. అప్పుడు రష్యన్ అమ్మాయి అరవడం.. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం.. ఇవన్నీ సెటైరికల్ గా చేశాడు వర్మ. కానీ పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయాడు అనేది మాత్రం నిజాలు ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టాడు. షార్ట్ ఫిలిం చూసిన తర్వాత వర్మ తిట్టాడ పొగిడాడా అనేది మాత్రం అర్థం కావడం కష్టం. 37 నిమిషాల నిడివి కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు వర్మ. 4 నిమిషాల టైటిల్స్.. 4 నిమిషాల పాట.. 4 నిమిషాలు చిరంజీవి ఎపిసోడ్.. 4 నిమిషాలు బండ్ల గణేష్ ఎపిసోడ్.. 8 నిమిషాలు వర్మ క్లైమాక్స్.. ఇలా పవర్ స్టార్ ను ప్లాన్ చేశాడు వర్మ. ఏదేమైనా అనుకున్న దానికంటే ఈసారి మాత్రం వర్మ ఎక్కువ నిరాశ పరచలేదు. నిజాన్ని దూరంగా ఉంటాయి అంటూ ఉన్నది ఉన్నట్లు చెప్పాడు ఆర్జీవి. 

More Related Stories