నేనే కేఏ పాల్.. కమ్మరాజ్యంలో కామెడీ సాంగ్..  RGV
2019-11-02 17:25:08

రాంగోపాల్ వర్మ మరోసారి షాక్ ఇచ్చాడు. అది కూడా చెప్పి మరి ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా పైనే ఉంది. ఇందులో ఒక్కొక్క పాట ట్రైలర్ ఫోటోలు విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచుకున్నాడు వర్మ. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటి నుంచే దానికి ప్రమోషన్ మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. ట్రైలర్ తోనే కావాల్సినంత ప్రమోషన్ తో పాటు కాంట్రవర్సీలు కూడా సృష్టించాడు వర్మ. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట విడుదల చేశాడు. పొలిటికల్ సంచలనం కెఏ పాల్ పై ఈ పాట నడుస్తోంది. నేనే పాల్ అంటూ జేమ్స్ బాండ్ తరహాలో ఈ పాట సాగుతుంది. ఇది చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు భలేగా నవ్వుకుంటున్నారు. ఇందులో లిరిక్స్ కూడా చాలా కామెడీగా ఉన్నాయి. నేను ఫోన్ చేస్తే ప్రపంచ యుద్ధాలు ఆగిపోతాయి.. పాకిస్తాన్ కి ఫోన్ చేసి తీవ్రవాదం ఆపమని చెప్పాను అంటూ కేఏ పాల్ చెప్పిన మాటలను ఇందులో వాడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. సినిమాలో క్యారెక్టర్ కూడా చాలా కామెడీగా ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. కచ్చితంగా కమ్మరాజ్యంలో కడప రెడ్లు తెలుగు ఇండస్ట్రీలో చాలా కాంట్రవర్సీలకు తెర తీస్తుందని నమ్ముతున్నాడు రాము. మరి ఈయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి.

More Related Stories