హైదరాబాద్ మేయర్ పై వర్మ ఆసక్తికర ట్వీట్



RGV
2021-03-04 14:28:05

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. వర్మ సినిమాలపై నే కాకుండా రాజకీయాలపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేసి నెట్టింట హల్చల్ చేస్తాడు. అయితే ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తుంటారు. అయితే తాజాగా ఇటీవల హైదరాబాద్ మేయర్ గా ఎన్నికైన గధ్వాల విజయ లక్ష్మి కుక్కకు ఆహారం తినిపిస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో "నాకు ఒక డౌట్ వస్తుంది. 

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన కుక్కను ప్రేమించిన దానిలో ..ఆమె కుటుంబాన్ని, టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్ మరియు తెలంగాణ ప్రజలను ఒక్క శాతమైనా ప్రేమిస్తుందా..వాళ్ళు కచ్చితంగా ఈ కుక్కపై కుల్లుకుంటారు." అంటూ ఆర్జీవి పోస్ట్ లో పేర్కొన్నారు. ఆర్జీవి వీడియో పోస్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విదేయో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ గోపాల్ వర్మ డి కంపెనీ, శ్రీదేవి అనే సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డి కంపెనీ సినిమాను దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్జీవి మాత్రం వాటిని ఖండిస్తున్నారు.

More Related Stories