కొత్త హీరోయిన్‌పై మనసు పారేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. Apsara Rani
2020-07-07 19:59:18

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడేం చేస్తాడనేది ఎవరికీ అర్థం కాదు. అసలు ఈయన ఎప్పుడెలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. అమ్మాయిల విషయంలో కూడా చాలా బోల్డ్ గా ఉంటాడు వర్మ. ఇన్ని రోజులు చాలా మందిని అన డ్రీమ్ గాల్స్ గా చెప్పుకున్న వర్మ.. ఇప్పుడు మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆమె కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధమే అంటున్నాడు ఈ దర్శకుడు. అంతగా తనను మాయ చేసిందని చెప్తున్నాడు ఈయన. వర్మ మనసు అంతగా దోచిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈ ముద్దుగుమ్మ పేరు అప్సర రాణి. పేరుకు తగ్గట్లే అప్సరలా ఉందంటున్నాడు వర్మ. ఈయన లాక్ డౌన్ మూవీస్ లో భాగంగా థ్రిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు. అందులో ఈమె నటిస్తుంది. 

తాజాగా విడుదలైన స్టిల్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన అప్సర స్టిల్స్ చూసి అంతా థ్రిల్ అవుతున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ అమ్మాయిపై వర్మ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే తనకు నచ్చిన అప్సర సంగతుల్ని స్వయంగా తెలిపాడు. థ్రిల్లర్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు ఈ దర్శకుడు. అప్సర ఒరిస్సాలో పుట్టి.. డెహ్రాడూన్ లో పెరిగిందని చెప్పాడు వర్మ. హైదరాబాద్ లో సెటిలైందని.. తన కోసం ఆకాశం నుంచి దిగి వచ్చిందని చెప్పాడు ఆర్జీవీ. ఇంత అందగెత్తను ఇన్నాళ్లూ మిస్సయ్యానంటూ ఫీలైపోతున్న వర్మ..  కచ్చితంగా ఈ అమ్మాయి ఆడియన్స్ కు థ్రిల్ ఇస్తుందని చెబుతున్నాడు. అంతేకాదు తన ట్విట్టర్ ను కూడా పూర్తిగా అప్సరకే అంకితం చేస్తున్నట్లు చెప్తున్నాడు ఆర్జీవీ. 

More Related Stories