ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్‌కి టికెట్టు పెట్టిన వ‌ర్మpower star
2020-07-14 18:23:32

`ప‌వ‌ర్ స్టార్‌` సినిమా ఎలా ఉన్నా, అందులో ఏమున్నా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ చూస్తార‌ని వ‌ర్మ ఆశ‌. అందుకే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని ఆరాట ప‌డుతున్నాడు. పవర్ స్టార్ ట్రైలర్ ఫ్రీగా చూడటం కుదరదు.. ఇది చూడాలంటే కూడా డబ్బులు కట్టాల్సిందే. 50 రూపాయల వరకు దీనికి వసూలు చేస్తున్నాడని తెలుస్తుంది. అభిమానులు ఎలాగూ చూడరు.. హేటర్స్ నుంచి డబ్బులు రాబట్టాలనేది వర్మ ప్లాన్. ఇలా ట్రైలర్‌కు కూడా డబ్బులు వసూలు చేసే దర్శకుడు ప్రపంచంలో వర్మ తప్ప మరెవరూ ఉండరేమో..? వర్మ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

More Related Stories