రామ్ గోపాల్ వర్మ మర్డర్ రివ్యూRGVs Murder
2020-12-24 13:10:40

గత కొన్నేళ్లుగా వర్మకు సరైన హిట్ లేకపోవడం తెలిసిన విషయమే. కానీ ఆయన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుకను థియేటర్లకు రప్పిస్తూ ఉంటారు. అలా తీసిన సినిమానే "మర్డర్". ఈ సినిమా ఆర్జీవి సమర్పణలో వచ్చింది. సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈరోజు (డిసెంబర్ 24)న సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదటి నుండి ఈ సినిమా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఆధారంగా తెరకెక్కించారంటూ వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రణయ్ హత్య కేసు ఆధారంగానే తెరకెక్కించారా..సినిమా ఎలా ఉంది. అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే చిన్నప్పటి నుండి తన కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి మాధవరావు..అతడి కూతురు నమ్రత. నమ్రత పుట్టినప్పటినుండే మాధవరావు కు వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అవుతాడు. 

దాంతో కూతురును కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన కూతురు పుట్టడంతోనే మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. అయితే కూతురు పెరిగి పెద్దయ్యాక కాలేజీలో ప్రవీణ్ అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. దాంతో కోటీశ్వరుడైన మాధవరావు తన పరువు తీసి ఆస్తి కాజేయ్యడానికే ప్రవీణ్ తన కూతురును బుట్టలో వేసుకున్నాడని కోపం తో రగిలిపోతు ఉంటాడు. దాంతో ప్రవీణ్ ను హత్య చేస్తాడు. ఇక ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఆధారంగానే తెరకెక్కించినట్టు ఉంది. కానీ చిత్ర బృందం అలా అనిపిస్తే మా తప్పు ఏమీ లేదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మాధవరావు తన కుతురుపై చూపించే ప్రేమను చూపిస్తే...సెకండ్ హాఫ్ లో ప్రవీణ్ పై మాధవరావు ఎలా కోపం తో రగిలిపోయాడు. 

చంపడానికి ఎలా స్కెచ్ లు వేసాడు తండ్రిగా అతడు అనుభవించే క్షోభ ను చూపించారు. ముఖ్యంగా ఈ సినిమా లో కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తండ్రులు పడే ఆవేదన బాధ ను చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమా కథను కేవలం తల్లి తండ్రుల దృష్టితోనే చూపించడం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. అంతే కాకుండా సినిమా కథ మొత్తం ముగ్గురి చుట్టే తిరగటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. సినిమాలో మాధవరావు పాత్రలో నటుడు ఒదిగిపోయాడు. ఒక తండ్రి భావోద్వేగాలు ఇలా ఉంటాయి. అని కచ్చితంగా చూపించగలిగాడు. తక్కువ ఖర్చుతో తీసునప్పటికి సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికి సెకండ్ హాఫ్ బోరింగ్ గా సీరియల్ లా సాగింది. మొత్తానికి వర్మ "మర్డర్" యావరేజ్ గా ఉంది.

More Related Stories