పవర్ స్టార్ అంటూ గాజు గ్లాస్ తో వర్మ రచ్చPower Star
2020-07-09 17:13:10

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరుతో సినిమా ప్రకటించి రచ్చ రేపాడు. ఇందులో నా హీరో ఇతనే అంటూ పవన్ ను పోలిన ఒక వ్యక్తి వీడియో రిలీజ్ చేసినప్పుడే ఇది పవన్ ని టార్గెట్ చేసిన సినిమా అని అర్ధం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ కి గట్టి షాకిచ్చారు. తన సినిమా పేరు 'పవర్ స్టార్' అని ప్రకటించి మధ్యలో పవన్ పార్టీ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు పెట్టి సంచలనానికి తెర లేపారు. ఇక ఈ లుక్ పోస్ట్ చేస్తూ ''ఇందులో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే యాదృచ్చికం మాత్రమే'' అంటూ తన మార్క్ డైలాగ్ వాడాడు వర్మ. ఇకపోతే పవర్ స్టార్ ఫస్ట్‌లుక్ విడుదల ముహుర్తాన్ని కూడా ప్రకటించేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ రోజు (జులై 9) ఉదయం 11 గంటల 37 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇది పెద్ద వివాదానికే దారి తీసే అవకాశం ఉంది.

More Related Stories