సైరా ట్రైలర్‌పై సంచలన రివ్యూ ఇచ్చిన వర్మ..RGV
2019-09-26 15:13:01

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా ఎవరికీ అనుమానాలు కూడా లేవు. ఇప్పుడు ఈ చిత్ర రెండో ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ చూసి అభిమానులు అంతా ఫిదా అయిపోతున్నారు. వర్మ కూడా దీనిపై ఇప్పుడు ఇచ్చిన రివ్యూ సంచలనంగా మారుతుంది. సాధారణంగా ప్రతీ దాంట్లోనూ బొక్కలు వెతకడం ఈయనకు బాగా అలవాటు. కానీ ఎందుకో తెలియదు కానీ సైరా ట్రైలర్ మాత్రం ఈయన్ని బాగా ఆకట్టుకుంది. వర్మ బుర్ర ఎప్పుడెలా మారుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇలాంటి ట్వీట్ చేసాడు ఈయన. ఈ ట్వీట్ చూసిన తర్వాత నిజంగానే ఇది వర్మ చేసాడా లేదంటే ఆయన ట్విట్టర్ ఎవరైనా హ్యాక్ చేసారా అనిపిస్తుంది. సైరా ట్రైలర్ చూసి.. నిజంగానే తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయని చెప్పాడు ఈయన. అప్పట్లో బాహుబలిని ఎలాగైతే పొగిడాడో ఇప్పుడు సైరాకు ఇదే చేస్తున్నాడు ఈయన. ఇలాంటి అద్భుతమైన సినిమా తెలుగు వాళ్లకు అందిస్తున్నందుకు నిర్మాత రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపాడు వర్మ. దాంతో పాటు చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఇది అంటున్నాడు వర్మ. ఆయన స్థాయిని పెంచే సినిమా సైరా అంటున్నాడు వర్మ. ఇప్పుడు ఈయన ఇచ్చిన రివ్యూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపేసింది.

More Related Stories