ఆ సినిమా చేసి అప్పులపాలైన రోజా Roja
2021-06-24 13:36:21

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్ర‌త్యేక‌ స్థానాన్ని ఏర్పరచుకున్న న‌టి రోజా. ప్ర‌స్తుతం రోజా ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ రాజకీయాల్లోనూ రానిస్తోంది. అయితే రాజకీయాల్లో మొదట్లో కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా రోజా చివ‌రికి కీల‌క నేత‌గా ఎదిగింది. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి 'ఏపీ ఏపీఐఐసి' చైర్మన్ గా కొనసాగుతోంది. సినిమాలు, రాజకీయాల్లో మాత్రమే కాకుండా రోజా జబర్దస్త్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు, అంతేకాకుండా ప్రత్యేక షో లలో కూడా కనిపిస్తూ జనాలని  అలరిస్తున్నారు. 

ఇదిలా ఉండ‌గా ఓకానొక స‌మ‌యంలో రోజా సినిమాల్లో కూడా న‌ష్టాల‌ను చూసింద‌ట‌. రోజా ఒకానొక దశలో నిర్మాతగా వ్యవహరించి తీవ్ర నష్టాలపాలయ్యారు. సుమన్ రోజా జంటగా ఆమె భ‌ర్త సెల్వమణి దర్శకత్వంలో 1994లో 'అతిర‌థి ప‌డై' అనే సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమానే తెలుగులో 'స‌మ‌రం' అనే పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో  అప్పులపాలు అయ్యానని అప్పులను తీర్చడానికి చాలా రోజులు పట్టిందని రోజా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్వూలో వెల్ల‌డించింది. అయితే చివరికి సినిమాలు చేయడం వల్లే మ‌ళ్లీ ఆ అప్పులు తీర్చానని రోజా స్ప‌ష్టం చేసింది. ఇక ఆ తర్వాత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం పై ఇంట్రెస్ట్ పోయినట్లు తెలిపింది.

More Related Stories