పబ్లిక్‌‌గా ముద్దులు పెడుతున్న పూరీ జగన్నాథ్ కొడుకు..Romantic
2020-02-11 23:12:43

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ ఇందులో ఆకాశ్ తో నటిస్తుంది. మెహబూబా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమా ఎంత రొమాంటిక్ గా ఉండబోతుందో విడుదలవుతున్న ఒక్కో పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు విడుదలైన మరో పోస్టర్ కూడా సంచలనాలు రేపుతుంది. 

ఏకంగా లిప్ లాక్ పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ పోస్టర్ చూసిన తర్వాత వామ్మో అనుకుంటున్నారంతా. ఈ సినిమాతో ఆకాశ్ ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోయేలా కనిపిస్తుంది. మెహబూబా సినిమాలో బాధ్యత గల యువకుడిగా కనిపించిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో పూర్తిగా రొమాంటిక్ అయిపోయాడు. ఇదిలా ఉంటే రొమాంటిక్ సినిమా పోస్టర్లపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ చిత్ర పోస్టర్ల గురించి మహిళా సంఘాలు కూడా గోల పెడుతున్నాయి. 

అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటూ వాళ్లు రచ్చ చేస్తున్నారు. బ్యాక్ లెస్ పోజుతో ఫస్ట్ పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు అనిల్. ఇప్పుడు లిప్ లాక్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరీ అందిస్తున్నాడు. మెహబూబాతో ఎలాగూ హిట్ ఇవ్వలేకపోయిన పూరీ.. రొమాంటిక్ తో కచ్చితంగా హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఈ పోస్టర్ లో ఉన్న అశ్లీలత చూస్తుంటే యూత్ చెడిపోడానికే అన్నట్లుంది అంటున్నారు విమర్శకులు. మరీ ఇంత తెగింపా అంటూ పూరీపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరేం అన్నా కూడా ఇది రొమాంటిక్ అంతే అంటున్నాడు డేరింగ్ డైరెక్టర్. మే 29న విడుదల కానుంది రొమాంటిక్ సినిమా.

More Related Stories