రాజమౌళికి టార్చర్.. RRR విషయంలో అది తప్పట్లేదు..Rajamouli
2020-01-30 18:18:24

రాజమౌళి సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ అది తెరకెక్కించే సమయంలో మాత్రం రాజమౌళికి లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. ఈ రోజుల్లో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను విడుదల వరకు లీక్ కాకుండా దాచుకోవడమే చాలా కష్టం అవుతుంది దర్శక నిర్మాతలకు. ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సినిమా షూటింగ్ బయటికి వస్తూనే ఉంది.. ఎవరో ఒకరు ఫోటోలు తీసి లీక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. 

అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలో జరిగిన రామ్ చరణ్ వీడియోలు బయటికి వచ్చాయి. పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు లీక్ అయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నాటి ఒక భారీ సెట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రామ్ చరణ్ ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించాడు దర్శక ధీరుడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్ లో గూడెం జనాలతో ఏదో చెబుతున్న వీడియో బయటికి వచ్చింది. 

ఇక మొన్నటికి మొన్న ఎన్టీఆర్, పులి ఫైట్ సీన్ కూడా లీక్ అయింది. ఊహించని విధంగా ఆన్ లైన్లో లీక్ అయిన వీడియోలు చూసి షాక్ అవుతున్నారు రాజమౌళి యూనిట్. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ వివరాలు బయటికి రావడం.. ఫోటోలు లీక్ కావడం దర్శకుడికి ఏ మాత్రం నచ్చడం లేదు.. దాంతో షూటింగ్ లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అన్ని బ్యాన్ చేశాడు జక్కన్న. ఇకపై రూల్స్ ఇంకా కఠినతరం చేయనున్నాడు ఈ దర్శకుడు  అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చేది లేదని అల్టిమేటం జారీ చేశాడు. 

ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. గతంలోనే బాహుబలి సమయంలో విడుదలకు ముందే కొన్ని సీన్స్ లీకయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అందుకోసమే మరింత కేరింగ్ గా ఉండాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. 2020లో సినిమా విడుదల కానుంది.

More Related Stories