అజయ్ దేవ్‌గన్‌ను RRRలో తీసుకోడానికి కారణం అదే.. Rajamouli
2020-04-08 00:49:20

బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంతకంటే భారీ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కు కరోనా బ్రేకులు పడ్డాయి. అయితే వీలైనంత త్వరగా మళ్లీ లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ ను ఎందుకు తీసుకున్నారు.. బాలీవుడ్ లో అంతమంది హీరోలుండగా ఎందుకు ఈయన్నే తీసుకున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి కారణం ఈగ సినిమా టైమ్ లో అజయ్ హిందీ వర్షన్ కు డబ్బింగ్ చెప్పాడు. దాంతో ఆయనతో పరిచయం కారణంగా ఇప్పుడు RRR సినిమాలో తీసుకున్నారని అనుకున్నారు. కానీ దానికి కారణం మాత్రం మరోలా చెప్పాడు దర్శక ధీరుడు. 

అజయ్‌ను తీసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెప్పాడు రాజమౌళి. ఈ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నామని.. అయితే మొహంలో గాంభీర్యం.. మాట్లాడే పద్దతిలో నిజాయితీ.. సమగ్రత ఉండే నటుడి కోసం వెతుకుతున్న సమయంలో పది మందిని అడిగితే అందులో తొమ్మిది మంది అజయ్ దేవ్ గన్ పేరు చెప్పారని గుర్తు చేసుకున్నాడు రాజమౌళి. అజయ్ పాత్ర సినిమాలో ప్రాణం అని.. అందుకే అలాంటి బరువైన పాత్ర చేయడానికి ఎంతో అనుభవం ఉన్న నటుడు కూడా కావాలని చెప్పాడు జక్కన్న. ఆ నటుడి ప్రవర్తనను అందరూ నమ్మేలా ఉండాలి.. నటుడిలో ఉండాల్సిన లక్షణాలు.. నా అవసరాలు కొంత మందికి చెప్పి సలహా అడిగితే అంతా అజయ్ దేవ్ గన్ పేరు చెప్పారని చెప్పాడు రాజమౌళి. అందుకే ఆయన్ని తీసుకున్నామని చెప్పాడు ఈయన. 

More Related Stories