మ‌ళ్లీ నిరాశే..! ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా.. డేట్ ఇప్ప‌డే చెప్ప‌లేం..



ఆర్ఆర్ఆర్
2021-09-11 13:52:26

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లు ప్ర‌ధాన ప్రాత‌ల్లో దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.  రాజమౌళి ఈ చిత్రాన్ని మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’ తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలాగే ఆలియాభట్, అజయ్ దేవగన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ తెరకెక్కుతున్న చిత్రాన్నిఎప్పుడెప్పుడు వెండితెర‌పై చూస్తామా అనే అభిమానులకు మ‌రో సారి నిరాశే మిగిలింది.  ఈ  సినిమా విడుద‌ల‌ మరోసారి వాయిదా పడింది. 

ఇప్ప‌టికే కరోనా వల్ల అనేక‌సార్లు వాయిదా ప‌డినా  ఈ చిత్రం దసరా కానుకగా విడుదల అవుతుందని ఎంతో ఆశ‌గా  అభిమానులు వేచి చూశారు.  కానీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించింది.  పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ ఇంక కాస్త ఉంద‌నీ, అక్టోబ‌ర్ 21 లోగా పూర్తి కానున్న‌ద‌నీ తెలిపారు. కానీ విడుదల తేదిని మాత్రం వాయిదా వేసినట్లు తెలిపింది. ఇప్ప‌డే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేక పోతున్నామన్నారు. త్వరలోనే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. 

వాస్త‌వానికి అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కావాల్సివుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫ్రీలుక్స్, పాటలు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.

More Related Stories