ఎన్టీఆర్ అభిమానులకు రాజమౌళి సడన్ సర్ ప్రైజ్..RRR
2019-10-22 13:33:35

ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎప్పుడు ఏం తెలిసినా కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ఇంత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ జరుగుతున్నా కూడా పెద్దగా విశేషాలు మాత్రం బయటికి రావడం లేదు. చాలా జాగ్రత్తగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుపుతూ.. ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి ఆసక్తి కూడా అంతే పెరిగిపోతుంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా ఉంటాడో ఒక ప్రీ లుక్ విడుదల చేశాడు రాజమౌళి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఇప్పటివరకు అలాంటి కానుక ఇవ్వలేదు దర్శకధీరుడు. ఇక ఇప్పుడు అది కూడా తీరిపోతుంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి. ఇదే విషయాన్ని ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేశాడు. జక్కన్న నుంచి అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూద్దామా అంటూ వాళ్లు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం షూటింగ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. జనవరి వరకు టాకీ పూర్తి చేసి ఆ తర్వాత ఏడు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. 300 కోట్లతో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జులై 30, 2020న ఈ చిత్రం విడుదల కానుంది.

More Related Stories