ఆర్ఆర్ఆర్ నుండి మరో లీక్...రచ్చరచ్చే...RRR Update.jpg
2020-02-14 07:41:44

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు వీరుల పాత్రల్లో టాలీవుడ్ సూపర్ స్టార్స్ నటిస్తుండడంతో పాటు బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. అల్లూరి, కొమరం భీం యుక్తవయసులో దాదాపు ఒకే సారి అజ్ఞాతంలోకి వెళ్లారట, అలాగని వీరిద్దరూ కలిసి నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అలాంటి వీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని లైన్ గా రాసుకొని దాని చుట్టూ కథను అల్లి సినిమా తీస్తున్నారు.

1920 కాలం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ సినిమా ఉండనుంది. బ్రిటిష్ వారితో చరణ్, ఎన్టీఆర్ చేసే పోరాటాల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లూరి, కొమరం భీం మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుందట. ఈ సీన్ లో చరణ్ ఎన్టీఆర్ ను కొట్టడం జరుగుతుందని అంటున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎలాంటి సమాచారం బయట పెట్టకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న లీకులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

More Related Stories