ఎన్టీఆర్ హీరోయిన్ దొరికిందా ?RRR
2019-08-21 11:21:53

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలను కలుపుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఎప్పుడూ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అనుకున్న హాలివుడ్ అమ్మాయి డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ ప్రాజెక్టుకు దూరమైంది. ఆ తర్వాత కొందరి పేర్లు వినిపించినా అవేమీ ఆర్ఆర్ఆర్ యూనిట్ కన్ఫాం చేయలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటీష్ హీరోయిన్‌ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. 

అయితే ఆమె పేరు ఇంకా బయట పెట్టలేదు కానీ ఆమె పేరుని త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సీన్లను కేవలం ఎన్టీఆర్ పైనే చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. సైరా రిలీజ్ పనులు ఉండడంతో ఆయన ఒక నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇక బల్గేరియాలో కొన్ని సీన్లను ఎన్టీఆర్ పై తీయనున్నారని ఈ నెల 26 నుండి ఆ షూట్ ఉండవచ్చని అంటున్నారు. ఇక చరణ్ బ్రేక్ లో ఉండడంతో ఈ షూట్ కి ఎన్టీఆర్, రాజమౌళి ఇప్పుడు బల్గేరియాకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

More Related Stories