ఆర్ఆర్ఆర్ టైటిల్ ఫిక్స్....అంత అవసరమా RRR
2019-10-07 18:46:28

ఓవైపు అల్లూరి సీతారామ రాజు.. మరోవైపు కొమురం భీమ్‌..వీరిద్దరూ రెండు ప్రాంతాలకి చెందిన స్వతంత్ర యోధులు. వీరిద్దరూ కలిసరాని చరిత్రలో ఎక్కడా ఉన్నట్టు ఆధారాలు లేవు. కానీ వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే సబ్జెక్ట్ మీద తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్‌ సీతారామ రాజుగా ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించబోతున్న ఈ సినిమాలో చెర్రీకి జోడీగా అలియా భట్‌ కనిపించబోతుండగా.. తారక్‌కు జోడీ మాత్రం దొరకడం లేదు. ఇంకా ఆమెను వెతికిపట్టుకునే పనిలో ఉంది చిత్ర బృందం. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేసే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించింది జక్కన్న బృందం. సినిమా ప్రెస్ మీట్ లోనే ఈ విషయాన్ని ప్రకటించిన జక్కన్న నచ్చిన టైటిల్స్ పంపమని కూడా కోరారు. దీంతో ట్విటర్‌ వేదికగా నెటిజన్ల నుంచి కుప్పలు తెప్పలుగా టైటిళ్లు వచ్చి పడ్డాయి.

అందులో రామ రావణ రాజ్యం అనేది అందరూ ఎక్కువ సజెస్ట్ చేసిన పేరుగా తేలింది. ఇక చాన్నాళ్ళగా వీటన్నింటినీ పరిశీలిస్తున్న రాజమౌళి బృందం ఒక టైటిల్‌ ని ఫైనల్ చేసిందని అంటున్నారు. ఈ పేరు తెలుగులో ఎలా సూట్ అవుతుందో మిగతా భాషల్లోనూ అంతే చక్కగా సూట్ అయిందని అంటున్నారు. అదే రామ రౌద్ర రుషితం. జక్కన్న ఈ టైటిల్ నే ఫైనల్‌ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ విన్న నెటిజన్లనుండి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది బాగానే ఉందని అంటుంటే కొందరు మాత్రం చక్కగా తెలుగులో పెట్టుకోక అంత గ్రాంధిక బాష అవసరంమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రచారం అయితే గట్టిగానే జరుగుతున్నా ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. 

More Related Stories