సాహో ప్రపంచ రికార్డ్.. ప్రభాస్ బ్యాడ్ బాయ్ సాంగ్ అదుర్స్..Saaho
2019-08-21 15:39:32

సాహో సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఇప్పుడు సాహో కోసం ఒళ్లే కళ్లుగా మార్చుకుని చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వాళ్ల ఎదురు చూపులే సినిమాకు వరల్డ్ రికార్డులను సైతం తీసుకొచ్చి పెడుతున్నాయి. ఓ తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో గుర్తింపు రావడం బాహుబలి తర్వాత ఇదే తొలిసారి. మళ్లీ అది ప్రభాస్ సినిమానే కావడం మరో విశేషం. ఇప్పుడు విడుదలైన బ్యాడ్ బాయ్ సాంగ్ వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. ఇది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు యూవీ క్రియేషన్స్. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినా కూడా ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఉన్నాడు దర్శకుడు సుజీత్. ఒకే ఒక్క అనుభవం ఉన్న ఈ దర్శకుడు.. ఇప్పుడు సాహోతో నేషనల్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ అయిపోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు అన్నీ ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విధంగా సాహో క్రేజ్ ఉంది ఇప్పుడు. తాజాగా విడుదలైన బ్యాడ్ బాయ్ సాంగ్ అయితే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతే కాకుండా ఈ పాటకు 3,58,664 మంది లైక్‌ ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు కొత్త చరిత్రకు నాందీ పలికింది. ఒక రోజులో ఓ పాటకు వచ్చిన అత్యధిక వ్యూస్ కానీ.. అత్యధిక మంది వీక్షించిన తొలి పాటగా 'సాహో.. బ్యాడ్‌ బాయ్‌' రికార్డులు క్రియేట్ చేసింది. ఇది చూసి చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 30న సాహో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి బాహుబలిని మించి రికార్డులు తిరగరాయాలని చూస్తున్నాడు ప్రభాస్.

More Related Stories