సాహోకు 400 కోట్లు వచ్చాయంట.. నిజమే అంటారా..?saaho
2019-09-09 20:59:41

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది.. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ టాక్ వచ్చింది. 100లో 70 మంది ఈ చిత్రం తమకు నచ్చలేదనే తేల్చేసారు. కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే మాత్రం 400 కోట్లు అంటున్నారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభాస్ కు ఎంత మార్కెట్ ఉన్నా కూడా మరీ 10 రోజుల్లోనే 400 కోట్లు వసూలు చేసేంత సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. దానికితోడు నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకు ఈ స్థాయి వసూళ్ళు వచ్చాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు వాళ్లు. కానీ నిర్మాతలు మాత్రం తమకు సాహో నష్టాలు తీసుకురాలేదని.. లాభాలు మాత్రం బాగానే తీసుకొస్తుందని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది.

నిజంగా సాహోకు ఈ స్థాయి కలెక్షన్లు వచ్చాయా లేదంటే ఫేక్ కలెక్షన్లు చూపిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజానికి తెలుగులో సాహోకు చెప్పుకోదగ్గ వసూళ్లు అయితే రావడం లేదు. ఇక్కడ ఈ సినిమా ప్లాప్.. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్. తెలుగులో దాదాపు 125 కోట్ల బిజినెస్ చేసిన సాహో.. 80 కోట్ల దగ్గరే ఆగిపోయింది. హిందీలో మాత్రం ఇప్పటికే 140 కోట్ల వరకు కలెక్షన్లు తీసుకొచ్చింది. కేవలం హిందీలో మాత్రమే హిట్ అనిపించుకుని మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయింది సాహో. కానీ ప్రపంచమంతా తమ సినిమా హిట్ అంటున్నారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తుంది. గతంలో కూడా 2.0 విషయంలో ఇలాంటి వాదనే వచ్చింది. ఆ సినిమా కూడా టాక్ తో పనిలేకుండా 700 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. కానీ ఆ తర్వాత బయ్యర్లు మాత్రం రోడ్డెక్కి తమ నష్టాలు తీర్చాలంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు సాహో విషయంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తమిళ, మళయాల భాషల్లో ఇప్పటికే సాహో డిజాస్టర్ అనేది తేలిపోయింది. మరి ఈ 400 కోట్ల లెక్క ఏంటో చూడాలిక.

More Related Stories