ఆ సూపర్ స్టార్‌తో సాహో సుజీత్ తర్వాత సినిమా..Sujeeth
2020-01-31 17:22:55

హిట్ సినిమా తీసాడా ఫ్లాప్ సినిమా తీసాడా అనేది పక్కన పెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసి ఔరా అనిపించాడు సుజిత్. షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో ఐదేళ్ల కింద రన్ రాజా రన్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ ఒక్క సినిమా అనుభవమే ఇప్పుడు ఈయన నుంచి సాహో వచ్చేలా చేసింది. దీనికి టాక్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఇంత చిన్న వయసులో అంత పెద్ద సినిమా చేసి జాతీయ వ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు సుజీత్. 

ప్రస్తుతానికి టాక్ తో పనిలేకుండా సాహో సంచలన వసూళ్లు తీసుకొస్తుంది సాహో. వరుసగా నాలుగు రోజులు వీకెండ్ రావడంతో భారీ కలెక్షన్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇప్పటికే 300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది సాహో. దాంతో ఈ కుర్ర దర్శకుడు తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి భారీ సినిమా చేస్తాడా లేదంటే చిన్న సినిమాతో సరిపెట్టుకుంటాడా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి ఇంత భారీ సినిమా ఇచ్చి ప్రభాస్ అనవసరంగా తప్పు చేశాడు అంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో.. తర్వాత సినిమా ఏమై ఉంటుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

దీనికి సమాధానంగా సుజిత్ మరోసారి పెద్ద సినిమానే చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన తర్వాతి సినిమా రామ్ చరణ్ హీరోగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే చరణ్ ను కలిసి కథ చెప్పాడని.. మరోసారి పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ కథనే సుజీత్ నమ్ముకుంటున్నాడని తెలుస్తుంది. నితిన్ హీరోగా ఓ చిన్న సినిమా చేయాలని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు మళ్లీ పెద్ద సినిమా వైపు ఈ దర్శకుడి అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఈయనతో పెద్ద సినిమా చేసి తప్పు చేసాడని కొందరు అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు.. మరి ఇలాంటి సమయంలో చరణ్ కూడా ఈ కుర్రాన్ని నమ్ముతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. ఇది పూర్తైన తర్వాత సుజీత్ సినిమాపై ఆలోచించనున్నాడు మెగా వారసుడు.

More Related Stories