అక్కడ కూడా మొదలయిపోయిన సాహో మానియాSaaho
2019-08-23 11:37:39

బాహుబలి విజయం తెచ్చిన క్రేజ్‌ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా సాహో. ఆయన సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది. రన్ రాజా రన్ సినిమా తెరకెక్కించిన సుజిత్‌ ఈ సినిమా దర్శకుడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రడ్డాను తీసుకోవడంతో పాటు బాహుబలి క్రేజ్ కూడా యాడ్ కావడంతో ఈ సినిమాకి దక్షిణాదితో పాటుగా ఉత్తరాదిలో కూడా సాహో మానియా ఉంది. సాహో సినిమా వావ్ అనే తీరుగా ముందుకు సాగిపోతుంది. సాహో ఈనెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానున్న‌ది. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ఒక రేంజ్ లో సాగుతున్నాయి.

అయితే సాహో ప్ర‌భాస్‌ కు మరో టెన్షన్ మొదలయ్యిందని అంటున్నారు. ఎందుకంటే భ‌విష్య‌త్‌లో మ‌ళ్ళీ బాహుబ‌లి, సాహో అంత రేంజ్ ఉన్న సినిమాలు చేయ‌గ‌ల‌నా లేదా అని ఆయనకు గుబులు, భ‌యం ప‌ట్టుకున్నాయ‌ని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ అనుకున్నట్టుగానే ఈ సినిమా మన దేశంలోనే కాదు బయట కూడా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా భారతీయులు, అందులోను తెలుగు వారుండే ఆస్ట్రేలియా దేశంలో సాహో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతున్నాయని అంటున్నారు. చూద్దాం అక్కడ సాహో మానియా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.

More Related Stories