సాహోకు అదిరిపోయే రేటింగ్స్.. హిందీ సినిమాలు మటాష్..saaho
2020-02-16 14:50:32

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో. ఈ చిత్రం తెలుగులో పెద్దగా విజయం సాధించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం సత్తా చూపించింది. 2019లో బాలీవుడ్ పెద్ద విజయాల్లో సాహో కూడా ఒకటి. ఈ చిత్రం అక్కడ 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి చూపించింది. ఇక ఈ చిత్ర డిజిటల్ ప్రింట్ డిసెంబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. సాహో హిందీ వర్షన్ కు అక్కడ మంచి అప్లాజ్ వచ్చింది. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా సాహో హిందీ వర్షన్ అక్కడ ప్లే చేసారు. జీ సినిమాలో సాహోను ప్లే చేసారు. రాత్రి 8 గంటలకు సాహో ప్రీమియర్ వచ్చింది. అయితే విచిత్రంగా బాలీవుడ్ సినిమాలకు కూడా రాని టిఆర్పీ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు అక్కడ వచ్చింది. ఈ సినిమాకు 128.20 లక్షల వ్యూవర్ షిప్ వచ్చినట్లు బార్క్ ప్రకటించింది. అదే సమయంలో వచ్చిన ఖాళీ కా కరిష్మా, పోలీస్ ఔర్ టైగర్, సింబా, కేజియఫ్ ఛాప్టర్ 1 కంటే కూడా బెటర్ రేటింగ్స్ సాహో తెచ్చుకుంది. హిందీలో ఇప్పటికీ సాహోకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు సాహో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక్కడ ప్రీమియర్ చేయడానికి కనీసం ఎవరూ శాటిలైట్ కూడా తీసుకోలేదు. ఏదేమైనా కూడా బాలీవుడ్ లో మాత్రం సాహో సత్తా చూపించింది.

More Related Stories